Breaking

పవన్‌ కళ్యాణ్‌ భవిష్యత్‌ దార్శనికుడు జనసేన కోఆర్డినేటర్‌ డా. నల్లంశెట్టి నాగార్జున

జమ్మలమడుగు: ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ భవిష్యత్‌ దార్శనికుడని జనసేన జమ్మలమడుగు నియోజకవర్గ కోఆర్డినేటర్‌ డా. నల్లంశెట్టి నాగార్జున అన్నారు. పవన్‌ కళ్యాణ్‌ జన్మదినం సందర్భంగా జమ్మలమడుగులో జనసేన ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసి, నిర్వహించిన రక్తదాన శిబిరంలో 100 మందికి పైగా జనసైనికులు రక్తదానం చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి వేడుకలు నిర్వహించారు. పవన్‌ కళ్యాణ్‌ నాయకత్వంలో రాష్ట్రంలో కొత్త తరహా పాలనకు బాటలు పడుతున్నాయని నాగార్జున పేర్కొన్నారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.