పులివెందుల: పట్టణంలోని పలు ప్రాంతాల్లో మ్యాన్‌హోల్ మూతలు ధ్వంసమై ప్రజలకు ప్రమాదకరంగా మారాయి. ముఖ్యంగా సంతోష్ హోటల్ వీధిలోని వివేకానంద స్కూల్ సమీపంలో, రిలయన్స్ ట్రెండ్స్ పక్క వీధుల్లో, ఎస్బీఐ కాలనీలోని 17వ వార్డు సచివాలయం వద్ద మ్యాన్‌హోల్ మూతలు పగిలిపోయి గోతులు ఏర్పడ్డాయి.
దీంతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కురిసిన సమయంలో గోతుల్లో నీరు చేరడంతో మ్యాన్‌హోల్‌లు కనిపించక ప్రమాదాల ముప్పు మరింత పెరుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు వెంటనే కొత్త మూతలు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని స్థానికులు కోరుతున్నారు



