ప్రొద్దుటూరు: న్యూ వస్త్రభారతి హోల్సేల్ క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు మహనీయులు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు చీమల రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ దేశ ఐక్యత, సమైక్యతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. వ్యాపార రంగంలో క్రమశిక్షణతో పాటు సమాజ సేవకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, కమిటీ సభ్యులు, హోల్సేల్ వస్త్ర వ్యాపారులు పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Was this article useful?



