పులివెందుల: జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా న్యూ వికాస్ హైస్కూల్లో సోమవారం నేత్రదానం, అవయవదానం, రక్తదానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ రవికుమార్‌రెడ్డి, స్నేహిత అమృత హస్తం సేవాసమితి నేత్ర సేకరణ కేంద్రం అధ్యక్షుడు రాజు, విద్యార్థులు పోస్టర్లను ఆవిష్కరించారు. నేత్రదానం ద్వారా అంధులకు చూపును ప్రసాదించవచ్చని, అవయవదానం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని రవికుమార్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులు దానాల ప్రాధాన్యతను కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తెలియజేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Was this article useful?



