Breaking

నీరు లేక ఖరీఫ్ సాగుకు బ్రేక్.. రైతుల్లో ఆందోళన

దువ్వూరు, ఆగస్టు 24: మండలంలో ఖరీఫ్ వ్యవసాయ పనులు ఆశించిన స్థాయిలో సాగడం లేదు. వర్షాలు తగ్గిపోవడంతో పాటు కేసీ కాలువ, తెలుగు గంగ కాలువల్లో నీరు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కేసీ కాలువ కింద సాధారణంగా సుమారు 10 వేల ఎకరాల్లో వరి సాగు చేయాల్సి ఉండగా, ఈ ఏడాది నీటి కొరతతో సాగు ప్రశ్నార్థకంగా మారింది. తెలుగు గంగ కింద ఆరుతడి పంటల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. బోరు బావుల ఆధారంగా కొద్దిపాటి పసుపు, ఉల్లి, జొన్న, మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్నా భూగర్భ జలాలు తగ్గుతుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. వ్యవసాయ పనులు లేక కూలీలకు కూడా ఉపాధి తగ్గిపోయింది. రానున్న రోజుల్లో వర్షాలు కురిసి రబీ సాగుకైనా అనుకూల పరిస్థితులు ఏర్పడాలని రైతులు ఆశిస్తున్నారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.