ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 30: పంపింగ్ వాల్వ్ మరమ్మతుల కారణంగా పట్టణంలోని డ్రైవర్ కొట్టాల, గోకుల్ నగర్ ప్రాంతాలకు బుధవారం నీటి సరఫరా వేళల్లో మార్పు చేసినట్లు పురపాలక సంఘం అధికారులు తెలిపారు. సాధారణంగా ఉదయం 4 నుంచి 6 గంటల వరకు సరఫరా చేసే నీటిని, మరమ్మతుల నేపథ్యంలో ఈరోజు ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల ప్రజలు నీటి సరఫరా వేళల్లో మార్పును గమనించి సహకరించాలని అధికారులు కోరారు.
Was this article useful?



