పులివెందుల: దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను నివారించేందుకు ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సబ్ యూనిట్ అధికారి సిద్దయ్య సూచించారు. శుక్రవారం నిర్వహించిన “ఫ్రైడే–డ్రైడే” కార్యక్రమంలో భాగంగా పెద్దరంగాపురం గ్రామంలో ఇంటింటా జ్వర సర్వే, లార్వా గుర్తింపు సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా నీరు నిల్వ ఉండే డ్రమ్ములు, కూలర్లు, ట్యాంకులు, పాత టైర్లు, పూల కుండీలు తదితర ప్రాంతాలను వారానికి ఒకసారి పూర్తిగా శుభ్రం చేసి ఆరబెట్టాలని ప్రజలకు అవగాహన కల్పించారు. జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.



