రాయచోటి: భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు పులి నరేంద్ర కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు నూతన జిల్లా కమిటీని ప్రకటించారు. ఇందులో భాగంగా రాయచోటికి చెందిన నిర్మల్ కుమార్ను అన్నమయ్య జిల్లా బీజేపీ కార్యదర్శిగా నియమించారు. ఈ సందర్భంగా నిర్మల్ కుమార్ పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. నూతన జిల్లా కమిటీ సభ్యులకు రాయచోటి బీజేపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
Was this article useful?



