110 మంది పోలీసులతో బందోబస్తు.. డీఎస్పీ బాలస్వామిరెడ్డి పర్యవేక్షణ
ప్రొద్దుటూరు: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు ప్రొద్దుటూరు పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. డీఎస్పీ బాలస్వామిరెడ్డి ఆధ్వర్యంలో ఐదుగురు సీఐలు, తొమ్మిది మంది ఎస్ఐలు, 110 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు.
నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మూడు అంచెల భద్రత ఏర్పాటు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నామినేషన్ల ప్రక్రియను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల నిబంధనలు పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించాలని అధికారులు కోరారు.



