కడప జిల్లా: దేవుని కడప చెరువు బ్రిడ్జి సమీపంలో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో బైక్ దెబ్బతినగా, గాయపడిన యువకులు రోడ్డుపై పడిపోయారు. వెంటనే స్పందించిన స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం అందించి, బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
Was this article useful?



