Breaking

దేవుని కడపలో శ్రీవారి పవిత్రోత్సవాలు

కడప: దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 24 నుంచి 26వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాలకు ముందుగా సెప్టెంబరు 23న సాయంత్రం పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
సెప్టెంబరు 24న ఉదయం చతుష్టార్చన, అగ్ని ప్రతిష్ట, పవిత్ర ప్రతిష్టతో పాటు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగుతాయి. 25న పవిత్ర సమర్పణ, 26న పూర్ణాహుతి, పవిత్రవితరణ నిర్వహించనున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు చేపట్టనున్నారు.
యాత్రికులు, సిబ్బంది వల్ల తెలియక జరిగే దోషాల కారణంగా ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం కలగకుండా నివారించేందుకు ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని టీటీడీ అధికారులు తెలిపారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.