కడప: వైఎస్సార్ కడప జిల్లా దువ్వూరులో పోలీసుల కాల్పుల ఘటన కలకలం రేపింది. ఎర్రచందనం స్మగ్లర్‌గా భావిస్తున్న జాకీర్‌పై పోలీసులు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనలో జాకీర్ కాలుకు గాయమైనట్లు తెలుస్తోంది. గాయపడిన అతడిని పోలీసులు ప్రథమ చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం రిమ్స్‌కు తరలించేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Was this article useful?



