పీలేరు, సెప్టెంబర్ 30: రైతులు దళారుల ప్రమేయం లేకుండా తమ పంటలను నేరుగా వినియోగదారులకు విక్రయించుకునేలా పీలేరు పట్టణంలోని వారపు సంతలో నూతనంగా నిర్మించిన రైతు బజార్‌ను ఎమ్మెల్యే నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు.
రూ.26 లక్షలతో 46 సెంట్ల స్థలంలో నిర్మించిన రైతు బజార్లో 10 రైతుల గదులు, నాలుగు వాణిజ్య గదులు కలిపి మొత్తం 14 గదులు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రైతులకు అవసరమైన మౌలిక వసతులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి వారి ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతు బజార్ ద్వారా రైతులకు నేరుగా వినియోగదారులకు పంట ఉత్పత్తులను విక్రయించే అవకాశం కలుగుతుందని తెలిపారు.



