పులివెందుల, ఆగస్టు 18: రింగ్ రోడ్డు విస్తరణలో భాగంగా తొలగిస్తున్న చెట్లను సాధ్యమైనంత వరకు కాపాడి, ప్రత్యామ్నాయ ప్రాంతాల్లో తిరిగి నాటాలని కోరుతూ పులివెందులకు చెందిన చిన్న నరసింహులు, సుబ్బారెడ్డి, రాము, అమీర్బాషా తదితరులు ఆర్డీఓ చిన్నయ్యకు వినతిపత్రం అందజేశారు.
రింగ్ రోడ్డు పరిసరాల్లో ఏళ్లుగా పెరిగిన చెట్లను తొలగించడం వల్ల పర్యావరణానికి నష్టం కలిగే అవకాశం ఉందని వారు తెలిపారు. రోడ్డు విస్తరణకు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించి చెట్ల నరికివేతను తగ్గించాలని కోరారు. అభివృద్ధి పనులతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
వినతిపై స్పందించిన ఆర్డీఓ చిన్నయ్య.. తొలగించిన ప్రాంతాల్లో తిరిగి మొక్కలు నాటేలా సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.



