ప్రొద్దుటూరు: పట్టణంలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో తల్లుల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టీచర్లు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు పాల్గొని పుట్టిన వెంటనే శిశువుకు తల్లిపాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు, మొదటి ఆరు నెలలు తల్లిపాలే ఉత్తమ ఆహారమని వివరించారు. అలాగే గర్భిణులు, బాలింతలు పోషకాహారం తీసుకోవడం, చిన్నారులకు సమయానికి టీకాలు వేయించడం, పరిశుభ్రత పాటించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం గిద్దంగి వీధి, మేధరవీధి-2, శ్రీరాములపేట అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించారు.
Was this article useful?



