ప్రొద్దుటూరు, ఆగస్టు 7: ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రొద్దుటూరు అర్బన్ ప్రాజెక్టు దస్తగిరిపేట సెక్టార్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ జమీలా బేగం మాట్లాడుతూ, శిశువు ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు తల్లిపాలే ఉత్తమ ఆహారమని తెలిపారు. బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు అందించి, తొలి ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు. తల్లిపాలు శిశువుకు పోషకాలు, రోగనిరోధక శక్తిని అందించి వ్యాధుల నుంచి కాపాడతాయని వివరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, తల్లులు పాల్గొన్నారు.
Was this article useful?



