Breaking

డ్రైనేజీ ఆక్రమణలపై కమిషనర్ కొరడా.. వారం రోజుల్లో తొలగించాలని ఆదేశం

ప్రొద్దుటూరు: పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ నగర బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా మోడంపల్లి ప్రాంతంలో మున్సిపల్, వార్డు సచివాలయ అధికారులతో కలిసి పర్యటించి పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డ్రైనేజీలపై అక్రమ నిర్మాణాల కారణంగా మురుగునీరు రోడ్లపైకి ప్రవహిస్తుండటాన్ని గమనించిన కమిషనర్ సంబంధిత టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణలను తొలగించేందుకు స్థానికులకు వారం రోజుల గడువు విధించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు అందాల్సిన మున్సిపల్ సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులు, సిబ్బందే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పారిశుద్ధ్య పనులను ప్రతిరోజూ పర్యవేక్షించాలని శానిటేషన్ సూపర్‌వైజర్ నూరుబాషాను ఆదేశించారు. మోడంపల్లిలో తాగునీటి సరఫరా సక్రమంగా ఉందని స్థానికులు సంతృప్తి వ్యక్తం చేయడంతో ఏఈ సురేంద్ర, వాటర్ వర్క్స్ సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా 70 ఏళ్ల మహబున్ని పారిశుద్ధ్య నిర్వహణపై చేసిన సూచనలను తప్పకుండా పాటిస్తానని కమిషనర్ తెలిపారు. నగర బాట ద్వారా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, కాలపరిమితితో కూడిన చర్యలతో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో డీఈఈ రాజేష్, యశోద, ఏఈలు సురేంద్ర, దస్తగిరి, శానిటేషన్ సూపర్‌వైజర్ నూరుబాషా, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ విజయ్‌బాబు, సచివాలయ సిబ్బంది, నాయకులు సూర్యనారాయణరెడ్డి, శ్రీనివాసరెడ్డి, వెంకటసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.