ఎర్రగుంట్ల: మద్యం సేవించి వాహనాలు నడిపిన 10 మందికి కోర్టు రూ.లక్ష జరిమానా విధించినట్లు ఎర్రగుంట్ల అర్బన్ సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు. అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన 10 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో నిందితులను కమలాపురం జేఎఫ్సీఎం కోర్టులో హాజరుపరిచినట్లు పేర్కొన్నారు.
ప్రతి కేసులో నిందితుడికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించడంతో మొత్తం రూ.1,00,000 జరిమానా పడిందని సీఐ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని, వాహనదారులు బాధ్యతగా వ్యవహరించి ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.
Was this article useful?



