ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన డీఎస్సీ, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్ హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రకటించిన డీఎస్సీ నియామకాల ప్రక్రియపై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చిన భృతి, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని అన్నారు. ఈ నెల 6 నుంచి 9 వరకు రిలే దీక్షలు, 10న భారీ ర్యాలీ నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వం హామీల అమలులో నిర్లక్ష్యం కొనసాగిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Was this article useful?



