బద్వేలు, ఆగస్టు 7: డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బద్వేలులో చేపట్టిన రిలే నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డి పాల్గొని దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత పాటించలేదని, అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని, నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పార్టీ పోరాటం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
Was this article useful?



