మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు డీఎస్సీ నియామకాలలో అక్రమాలు జరిగాయంటూ పులివెందులలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నేతృత్వంలో మినీ సచివాలయం వద్ద నిర్వహించిన దీక్షల్లో విద్యార్థి సంఘాల నాయకులు, నిరుద్యోగ యువత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, స్పోర్ట్స్ కోటా ఎంపికల వివరాలను పారదర్శకంగా వెల్లడించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు.
Was this article useful?



