ప్రొద్దుటూరు: పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ సీఐ భాస్కర్ ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో రికార్డులు సక్రమంగా లేని 25 ద్విచక్ర వాహనాలను తనిఖీ చేసి, నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు మొత్తం రూ.6,250 జరిమానా విధించారు. వాహనదారులు తప్పనిసరిగా వాహన రికార్డులు, లైసెన్స్ తదితర ధ్రువపత్రాలను కలిగి ఉండాలని సీఐ సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీల్లో ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Was this article useful?



