ప్రొద్దుటూరు: సాయి రాజేశ్వరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్ఆర్ఐటీ)లో నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో 15 మంది బీటెక్ విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. బెంగళూరుకు చెందిన ట్యాప్ అకాడమీ సంస్థ సాఫ్ట్వేర్ డెవలపర్ ఇంటర్న్ పోస్టుల కోసం నిర్వహించిన ఎంపికల్లో సీఎస్ఈ నుంచి నలుగురు, ఈసీఈ నుంచి ఎనిమిది మంది, ఈఈఈ నుంచి ఇద్దరు, ఏఐఎంఎల్ నుంచి ఒకరు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ డాక్టర్ పాండురంగన్ రవి తెలిపారు. ఎంపికైన వారికి ఏడాదికి రూ.3 లక్షల ప్యాకేజీ ఉంటుందని ప్లేస్మెంట్ ఆఫీసర్ నజీర్ పేర్కొన్నారు. విద్యార్థులను కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు అభినందించారు.
Was this article useful?



