నందలూరు: మండలంలోని బలిజపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, మాజీ సర్పంచ్ సంభావు శ్రీనివాసులు ఇటీవల మృతి చెందడంతో రాజంపేట టీడీపీ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. శ్రీనివాసులు కుమారుడు సంభావు చంద్ర ఆహ్వానం మేరకు కర్మక్రియలకు హాజరైన మేడా విజయశేఖర్ రెడ్డి, శ్రీనివాసులు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Was this article useful?



