బద్వేలు, ఆగస్టు 19: పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీ పరిధిలోని కమ్మవారిపల్లెకు చెందిన కలవకూరి రమణ శివశంకర్ ఆధ్వర్యంలో బుధవారం టీడీపీ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. పోరుమామిళ్ల నుంచి బద్వేలు పట్టణం వరకు సాగిన ర్యాలీలో టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
అనంతరం బద్వేలు ఎన్జీవో కాలనీలోని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి కార్యాలయానికి చేరుకున్న రమణ శివశంకర్, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి మంచూరు సూర్యనారాయణ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పూలమాల వేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Was this article useful?



