బద్వేలు, ఆగస్టు 7: కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్‌ను బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్, ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బద్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించి, రహదారులు, తాగునీటి సౌకర్యాలు, మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని కలెక్టర్‌ను కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి పరిపాలనా సహకారం అందించాలని కూడా విజ్ఞప్తి చేశారు.
Was this article useful?



