ప్రొద్దుటూరు, ఆగస్టు 16: మున్సిపల్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమంలో నేలపై త్రివర్ణ పతాక రూపాన్ని ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ఇర్ఫాన్ బాషా అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతీయ జెండా దేశ గౌరవానికి ప్రతీక అని, దాని రూపాన్ని నేలపై ఏర్పాటు చేసి దానికంటే ఎత్తులో వేదికపై నిలబడటం సముచితం కాదన్నారు. అధికారులు, కార్యక్రమ నిర్వాహకులు జాతీయ జెండా గౌరవాన్ని కాపాడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Was this article useful?



