కడప: జమ్మలమడుగు మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్‌రెడ్డి సతీమణి చదిపిరాళ్ల జ్యోతి పేరు దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె రేపు మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు వైసీపీ తరఫున ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సతీమణి ఇందిరా పోటీ చేయనున్నారనే ప్రచారం సాగుతోంది. వైసీపీ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతుండగా, అభ్యర్థుల ప్రకటనతో జమ్మలమడుగు రాజకీయ సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. దీంతో దేవగుడి–గుండ్లకుంట వర్గాల మధ్య రాజకీయ పోటీపై చర్చ మొదలైంది.
Was this article useful?



