సింహాద్రిపురం, ఆగస్టు 5: చోరీ కేసులో స్వాధీనం చేసుకున్న బంగారు నగలను బాధితురాలికి సింహాద్రిపురం పోలీసులు అందజేశారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ సిద్ధార్థ మాట్లాడుతూ, నేరాల ఛేదనతో పాటు బాధితులకు న్యాయం చేయడం పోలీసుల ప్రధాన బాధ్యత అని అన్నారు.
గత ఏప్రిల్లో ఇత్తడి, రాగి వస్తువులను శుభ్రం చేస్తామని నమ్మించి ఓ మహిళ మెడలోని సుమారు మూడు తులాల బంగారు గొలుసును అపహరించిన కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని బంగారు గొలుసును రికవరీ చేసి కోర్టు అనుమతి అనంతరం బాధితురాలికి అప్పగించారు. దీంతో బాధితురాలు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Was this article useful?



