ప్రొద్దుటూరు, అక్టోబర్ 16: పట్టణంలోని పాత మార్కెట్ ప్రాంతంలో ఉన్న చెన్నకేశవస్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆరో రోజు సంతానలక్ష్మి దేవి అలంకరణతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఉదయం ఆలయంలో హోమాలు నిర్వహించి అమ్మవారికి విశేష పూజలు సమర్పించనున్నారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో చేపడుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందనున్నారు.
Was this article useful?



