ప్రొద్దుటూరులో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన చెకుముకి స్కూల్ స్థాయి సంబరాలకు విశేష స్పందన లభించింది. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో సుమారు 8,500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. స్కూల్ స్థాయి విజేతలకు సెప్టెంబర్ 11న శ్రీ తొగటవీర క్షత్రియ కళ్యాణ మండపంలో మండల స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఎన్. సునీత, రవిబాబు తెలిపారు.
Was this article useful?



