జమ్మలమడుగు, సెప్టెంబరు 23: బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో అనాథగా మిగిలిన వృద్ధుడికి ‘మే ఐ హెల్ప్ యు’ ఫౌండేషన్ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. గుడుంచెరువు రాజీవ్‌నగర్‌కు చెందిన చౌడం వెంకటరమణ అనారోగ్యంతో మృతి చెందగా, స్థానికుల సమాచారం మేరకు ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ అహ్మద్ హుస్సేన్ స్పందించారు.
సభ్యులతో కలిసి హిందూ స్మశానవాటికలో హిందూ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్‌రావు, నరేంద్ర, కిరణ్‌కుమార్, అశోక్‌కుమార్, సతీష్, సుబహన్ తదితరులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలకు సహకరించాలనుకునే దాతలు 82972 53484, 9182244150 నంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.
Was this article useful?



