Breaking

గుర్తు తెలియని ఇద్దరికి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్

ప్రొద్దుటూరు, ఆగస్టు 5: ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యంతో మరణించిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తుల మృతదేహాలకు బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో, ఆసుపత్రి సిబ్బంది సమాచారంతో మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యులు స్పందించారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో హిందూ స్మశానవాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్‌రావు, టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్‌తో పాటు అహమ్మద్ హుస్సేన్, సలీమ్, అశోక్ కుమార్, సతీష్ పాల్గొన్నారు. సమాజంలో అనాథలుగా మిగిలిన వారికి కూడా గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలు జరగాలనే ఉద్దేశంతో ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు.
అలాగే, శ్రీ అమ్మ శరణాలయంలోని వృద్ధులకు సహాయం చేయదలచిన దాతలు 82972 53484, 91822 44150 నంబర్లను సంప్రదించాలని ఫౌండేషన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.