దువ్వూరు: వైఎస్సార్ కడప జిల్లా దువ్వూరు మండలం పెద్దసింగనపల్లె గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ జొన్నవరం పద్మావతి (50) గుండెపోటుతో మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున ఆమెకు అకస్మాత్తుగా ఛాతినొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఆమె ప్రాణాలు నిలబెట్టలేకపోయారు.
పద్మావతి చాలా సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్‌గా సేవలందిస్తూ గ్రామ ప్రజలకు సుపరిచితురాలిగా ఉన్నారు. ఆమె మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతురాలికి భర్త జొన్నవరం రామచంద్రారెడ్డి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె ఆకస్మిక మరణంతో పెద్దసింగనపల్లె గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.



