ప్రొద్దుటూరు, అక్టోబర్ 16: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రొద్దుటూరు సూపర్ బజార్ రోడ్డులోని శ్రీ చౌడేశ్వరి దేవస్థానంలో శుక్రవారం ఆరో రోజు ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని గాయత్రీ దేవి అలంకారంలో ముస్తాబు చేసి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలో హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించగా, సాయంత్రం అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు ఆలయ నిర్వాహకులు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. శరన్నవరాత్రి వేడుకలతో ఆలయంలో ఆధ్యాత్మిక శోభ నెలకొనగా, అమ్మవారి దర్శనం చేసుకున్న భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.
Was this article useful?



