ప్రొద్దుటూరు, అక్టోబర్ 16: దసరా ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని పలు ఆలయాల్లో శుక్రవారం గజలక్ష్మి దేవికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. మెయిన్ బజార్లోని అమ్మవారిశాలలో శ్రీ సూక్త, చతుష్షష్టి, ధన్వంతరి హోమాలతో పాటు యంత్రార్చనలు చేపట్టారు. రాత్రి స్వర్ణ శ్రీచక్ర మేరు వద్ద విభూది, బిల్వదళాలతో అర్చనలు నిర్వహించారు. అగస్త్యేశ్వరస్వామి ఆలయం, శాస్త్రినగర్లోని రాజరాజేశ్వరి దేవి ఆలయాల్లోనూ గజలక్ష్మి దేవిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు జరిపించారు. అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారి మూలమంత్ర హోమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆయా ఆలయాలను సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు.
Was this article useful?



