ప్రొద్దుటూరు: గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 1.28 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల మేరకు ఆర్టీపీపీ కెనాల్ రోడ్డు, రామాపురం ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతని వద్ద నుంచి 1,220 గ్రాముల ఎండు గంజాయితో పాటు మరో 60 గ్రాముల గంజాయిని గుర్తించారు. మొత్తం 1,280 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీని విలువ సుమారు రూ.20 వేలు ఉంటుందని పేర్కొన్నారు. నిందితుడిపై ఎన్డీపీఎస్ చట్టం-1985 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు.



