సింహాద్రిపురం: దివంగత రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఇరికిరెడ్డి గంగిరెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో దివ్యాంగులకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేశారు. ముద్దనూరు రోడ్డులోని వికలాంగుల కమ్యూనిటీ భవనంలో జరిగిన కార్యక్రమంలో గంగిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విశ్రాంత అధ్యాపకులు యడుగూరి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుడిగా, హెడ్మాస్టర్గా, ఉచిత వైద్యసేవలు అందించిన గంగిరెడ్డి సేవలు చిరస్మరణీయమని అన్నారు. అనంతరం దివ్యాంగులకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు, పండ్లు, స్వీట్లు అందజేశారు. కార్యక్రమంలో ఇరికిరెడ్డి రఘునాథరెడ్డి, డాక్టర్ అభిలాష్‌రెడ్డి, వికలాంగుల సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.
Was this article useful?



