ప్రొద్దుటూరు, ఆగస్టు 31: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పర్యటించిన అనంతరం సభా ప్రాంగణాన్ని శుద్ధి చేయడం కుల వివక్షకు నిదర్శనమని కాంగ్రెస్ నాయకుడు ఇర్ఫాన్ బాషా మండిపడ్డారు. జాతీయ స్థాయి నాయకుడికే ఇలాంటి అవమానం జరగడం దారుణమన్నారు. దీనిపై ప్రశ్నించిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపైనే కేసు నమోదు చేయడం అన్యాయమని ఖండించారు. అక్రమ కేసులతో రాహుల్‌గాంధీని భయపెట్టలేరని స్పష్టం చేశారు. వెంటనే కేసును ఉపసంహరించుకుని, కుల వివక్షకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
Was this article useful?



