కడప: నూతన ఓటర్ల జాబితా ప్రచురణ అనంతరమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ నేత ఎస్.బి. అంజాద్ బాషా డిమాండ్ చేశారు. కడపలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. SIR ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికలు నిర్వహించవద్దని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.
పారదర్శకమైన ఓటర్ల జాబితా ఆధారంగానే ఎన్నికలు జరగాలని, వైఎస్సార్సీపీ ఎన్నికలకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఓట్ల తొలగింపుతో కడపలో ఓటర్ల సంఖ్య తగ్గిందని, ఇది డివిజన్లు, వార్డుల రిజర్వేషన్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా స్వతంత్రంగా వ్యవహరించాలని అంజాద్ బాషా కోరారు.
Was this article useful?



