ప్రొద్దుటూరు : ముద్దనూరు సమీపంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గుజ్జల కృష్ణయ్య యాదవ్ కుటుంబానికి వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు నాగేంద్రరెడ్డి ఆర్థిక చేయూత అందించారు. కృష్ణయ్య కుమార్తె స్నేహిత లక్ష్మి పేరుతో రూ.50 వేల మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా నాగేంద్రరెడ్డి మాట్లాడుతూ స్నేహిత లక్ష్మి వివాహ సమయంలోనూ తనవంతు సహాయం అందిస్తానన్నారు. యాదవ కుటుంబాలకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో యాదవ కుల పెద్దలు గంగయ్య, వేణు, సుబ్బరాయుడు, వైఎస్సార్సీపీ నాయకులు సుబ్రమణ్యం, బీసీ యాదవ్, చిన్న సుబ్బరాయుడు యాదవ్, నాగ సుబ్బారెడ్డి, ఓబుల్‌రెడ్డి పాల్గొన్నారు.
Was this article useful?



