ప్రొద్దుటూరు: బొల్లవరం గ్రామానికి చెందిన 88 ఏళ్ల వృద్ధుడు బండి ఆత్మకూరు రామిరెడ్డికి సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్‌లో ఊరట లభించింది. తన ఇద్దరు కుమారుల పేర్లపై గతంలో చేసిన గిఫ్ట్ సెటిల్మెంట్ డీడ్లను రద్దు చేయాలని ఆయన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. విచారణలో కుమారులు వృద్ధ తండ్రిని సక్రమంగా పోషించకపోవడం, ఆహారం, వైద్యం, నివాసం వంటి ప్రాథమిక అవసరాలు అందించకపోవడం నిర్ధారణ కావడంతో, 2019లో నమోదైన రెండు గిఫ్ట్ సెటిల్మెంట్ డీడ్లను చట్ట ప్రకారం చెల్లుబాటు కానివిగా ట్రిబ్యునల్ ప్రకటించింది. సంబంధిత ఆస్తులపై హక్కులు, టైటిల్‌ను వృద్ధుడికి పునరుద్ధరించాలని ఆదేశిస్తూ, రిజిస్ట్రేషన్, రెవెన్యూ రికార్డుల్లో అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది.
Was this article useful?



