ప్రొద్దుటూరు: కార్పొరేట్ సంస్థల రాకతో పట్టణంలో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి అన్నారు. శుక్రవారం నెహ్రూ రోడ్డులోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాచమల్లు హయాంలోనే పలు కార్పొరేట్ సంస్థలు ప్రొద్దుటూరుకు వచ్చాయని తెలిపారు. ఇప్పటికే పట్టణంలో అనేక సంస్థలు ఉన్నాయని, మరిన్ని సంస్థలు వస్తే స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కార్పొరేట్ సంస్థలపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. సమావేశంలో టీడీపీ, జనసేన నాయకులు ఘంటశాల వెంకటేశ్వర్లు, చల్లా రాజగోపాల్యాదవ్, శ్రీనివాసాచారి, సుంకర మురళీ తదితరులు పాల్గొన్నారు
Was this article useful?



