ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 30: రోటరీ సర్వీస్ కాంప్లెక్స్ ట్రస్ట్ ప్రొద్దుటూరు, జిల్లా అంధత్వ నివారణ సొసైటీ కడప ఆధ్వర్యంలో కామనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఉచిత కంటి పరీక్షల శిబిరం నిర్వహించారు. రోటరీ కంటి ఆసుపత్రి అధ్యక్షుడు ఎం.వి.ఎన్. ప్రభు అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ప్రారంభించి, రోటరీ సంస్థ అందిస్తున్న సేవలను అభినందించారు.
శిబిరంలో 53 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 23 మంది శస్త్రచికిత్సలకు ఎంపికయ్యారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు కంటి వైద్య సేవలను అందించేందుకు ఇలాంటి శిబిరాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో రోటరీ ఐ హాస్పిటల్ కార్యదర్శి బేపారి జాకీర్ అహ్మద్, జాయింట్ సెక్రెటరీ టి. బాలసూర్యరావు, వైద్య బృందం, రోటరీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



