పులివెందుల: పులివెందుల నియోజకవర్గానికి చెందిన 83 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన రూ.40,16,350 విలువైన చెక్కులను సోమవారం పులివెందుల టీడీపీ కార్యాలయంలో జడ్పీటీసీ మారెడ్డి లతారెడ్డి పంపిణీ చేశారు.
వివిధ అనారోగ్య కారణాలతో వైద్య చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులు చేసిన విజ్ఞప్తుల మేరకు వారి దరఖాస్తులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం మంజూరయ్యేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా లతారెడ్డి మాట్లాడుతూ కష్టకాలంలో ఉన్న ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అవసరమైన సహాయం అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు సీఎం చంద్రబాబు, బీటెక్ రవికి కృతజ్ఞతలు తెలిపారు.



