కల్లూరు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా కల్లూరు గ్రామంలో ఆయన విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు. పార్లమెంటరీ రాష్ట్ర కార్యదర్శి నాగేంద్రరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముందుగా వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి, అనంతరం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్ ప్రజలకు అందించిన సేవలను, సంక్షేమ పథకాలను నాయకులు, కార్యకర్తలు స్మరించుకున్నారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన వారికి అల్పాహారం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో నాగ సుబ్బారెడ్డి, ఓబుల్‌రెడ్డి, కిరణ్, రాజా యాదవ్, సుబ్రహ్మణ్యం, బీసీ యాదవ్‌తో పాటు గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Was this article useful?



