Breaking

కరాయిగూడలో పీఎం జన్మన్ ఇళ్ల నిర్మాణాల పరిశీలన

అనంతగిరి మండలంలో హౌసింగ్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ (ఎస్‌ఈ) జై రామాచారి ఆదివారం కోనాపురం పంచాయతీ పరిధిలోని కరాయిగూడ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో పీఎం జన్మన్‌ పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.

కరాయిగూడ గ్రామానికి పీఎం జన్మన్‌ పథకం కింద మొత్తం 77 ఇళ్లు మంజూరు కాగా, వాటిలో 25 ఇళ్లకు పునాది పనులు పూర్తయ్యాయి. 42 ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉండగా, 10 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇళ్ల నిర్మాణ పురోగతిని ఎస్‌ఈ జై రామాచారి పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడి పనుల వివరాలను తెలుసుకున్నారు.

ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, మంజూరైన ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. అలాగే నిర్మాణ పనుల్లో ఎదురవుతున్న సమస్యలను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ పర్యటనలో ఏఈ నాగేశ్వరరావు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావు, డీఈఓ, ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచ్‌, గ్రామ పెద్దలు, హౌసింగ్‌ లబ్ధిదారులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.