Breaking

కమిషనర్ తీరుపై కాంగ్రెస్ నేత నిరసన

కమలాపురం: మున్సిపల్ కమిషనర్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ నాయకుడు అశోక్ రెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. సామాన్య ప్రజల నీటి కుళాయి కనెక్షన్లు, పన్నుల చెల్లింపుల విషయంలో అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.
మున్సిపల్ పరిధిలో అనధికారిక భవన నిర్మాణాలపై కూడా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, ప్రజల నుంచి అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. సమస్యలపై ప్రశ్నించే ప్రజలతో అధికారులు దురుసుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఆరోపణలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అశోక్ రెడ్డి డిమాండ్ చేశారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.