కడప: కడప అర్బన్ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న ఆవులేటి నాగేశ్వరరావుకు జిల్లా కలెక్టర్ కీలక అదనపు బాధ్యతలు అప్పగించారు. కలెక్టరేట్ పరిపాలన అధికారి (అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నాగేశ్వరరావు మంగళవారం కలెక్టరేట్లో అదనపు బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుతం తహసీల్దార్ బాధ్యతలతో పాటు కలెక్టరేట్ పరిపాలన వ్యవహారాలను కూడా ఆయన పర్యవేక్షించనున్నారు. ఈ నియామకంపై అధికారులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.
Was this article useful?



