అమరావతి: ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రరావు (నాగబాబు)ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ, అటవీ శాఖ G.O.Rt.No.93 ద్వారా ఈ నియామకాన్ని ప్రకటించింది. ఛైర్మన్‌గా నాగబాబుకు క్యాబినెట్ హోదా కల్పించింది. రాష్ట్రంలో పచ్చదనం పెంపు, పునర్వనీకరణ, అటవీ పరిరక్షణ కార్యక్రమాలను సమన్వయం చేయడం ఆయన ప్రధాన బాధ్యతగా ఉండనుంది. 2047 నాటికి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో గ్రీన్ కవర్‌ను 50 శాతానికి పెంచే లక్ష్యంతో ఏపీ గ్రీన్ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. జిల్లాస్థాయి సంస్థలతో సమన్వయం చేస్తూ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో నాగబాబు కీలక పాత్ర పోషించనున్నారు.
Was this article useful?



